అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Electricity Demand | ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా నిజామాబాద్ (Nizamabad) సర్కిల్ పరిధిలో విద్యుత్ వినియోగం సాధారణ పరిస్థితుల కంటే ఎక్కువగా ఉందని టీజీఎన్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ (SE) పి.వి.రాజేశ్వర్ రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Electricity Demand | వినియోగం, డిమాండ్ గణాంకాలివే..
2025తో పోలిస్తే 2026 జూలై, ఆగస్టులలో విద్యుత్ వినియోగం 3.53శాతం పెరగగా, సెప్టెంబర్‌లో 53.83శాతం, అక్టోబర్ 1–12 మధ్య ఏకంగా 68.01శాతానికి పైగా పెరిగింది. సెప్టెంబర్‌లో గరిష్ఠ డిమాండ్ 767 మెగావాట్లకు చేరింది. అక్టోబర్‌లో రోజువారీ వినియోగం గత ఏడాదితో (6.38 మిలియన్ యూనిట్లు) పోలిస్తే 11.25 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఈ సందర్భంగా ఆయా డివిజన్, సర్కిల్, కార్పొరేట్ స్థాయిల్లో నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, నోడల్ అధికారులను నియమించామని ఎస్ఈ తెలిపారు.
Electricity Demand | 2027 వేసవి ప్రణాళిక..
వచ్చే వేసవి డిమాండ్‌ను తట్టుకోవడానికి ముందస్తుగా 4 కొత్త సబ్స్టేషన్లు, 10 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 468 డిటీఆర్లు, 28 కెపాసిటర్ బ్యాంకులు, కొత్త ఫీడర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎస్ఈ తెలిపారు. సాంకేతిక లోపాలు తలెత్తకుండా వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే తమ ప్రాధాన్యత అని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Police Training | బాధితులకు సత్వర న్యాయం అందించాలి..: ఎస్పీ రాజేష్ చంద్ర