అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy SIR Completion | ఎల్లారెడ్డి నియోజకవర్గం వందశాతం ఎస్ఐఆర్ పూర్తిచేసి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రథమంగా సర్ ప్రక్రియ పూర్తిచేసినందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎమ్మెల్యే మదన్మోహన్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, బీఎల్వోలకు అభినందనలు తెలిపారు.
Yellareddy SIR Completion | నియోజకవర్గ వివరాలివే..
నియోజకవర్గంలో మొత్తం 2,28,503 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, వాటిని బీఎల్వోలు యాప్‌ల ద్వారా వందశాతం డిజిటలైజేషన్ పూర్తిచేశారు. 22,283 మంది ఓటర్లను మృతిచెందిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిగా, డబుల్ ఓటర్లుగా గుర్తించారు. నియోజకవర్గంలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను విభజించి కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గాంధారిలో 5, లింగంపేటలో 8, నాగిరెడ్డిపేటలో ఒకటి, సదాశివనగర్‌లో 4, ఎల్లారెడ్డిలో 2 కేంద్రాలు కొత్తగా రానున్నాయి.
Yellareddy SIR Completion | మండలాల వారీగా వివరాలు
ఓటర్లలో మ్యాప్కాని వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిలో 998 మంది ఓటర్లు, తాడ్వాయిలో 313, నాగిరెడ్డిపేటలో 576, గాంధారిలో 1,316, లింగంపేటలో 1,096, రామారెడ్డిలో 784, రాజంపేటలో 253, సదాశివనగర్‌లో 1,328 ఉన్నారు. అలాగే తాడ్వాయిలో 969మంది ఓటర్లు, నాగిరెడ్డిపేటలో 900, గాంధారిలో 1,202, లింగంపేటలో 1,239, రామారెడ్డిలో 655, ఎల్లారెడ్డిలో 1,115, రాజంపేటలో 341, సదాశివనగర్‌లో 1,180 మృతి చెందిఉన్నారు. అలాగే తాడ్వాయిలో 1,208, నాగిరెడ్డిపేటలో 873, గాంధారిలో 1,821, లింగంపేటలో 1,164, రామారెడ్డిలో 1,089, ఎల్లారెడ్డిలో 1,212, రాజంపేటలో 413, సదాశివనగర్ 1,395 మంది వివరాలు మ్యాపింగ్ చేయలేదు.
Yellareddy SIR Completion | ముఖ్య తేదీలు
ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 10న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
ఇది కూడా చదవండి..: Manjeera River Flow | జలకళను సంతరించుకున్న మంజీర.. పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం