అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ajinkya Rahane Retirement | భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. టీమ్ ఇండియా (Team India) తరఫున దశాబ్దానికి పైగా సాగిన తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికారు.
అంజిక్య రహానే కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో భారత సెలెక్టర్లు ఆయనను పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఆయన తన రిటైర్మెంట్ ప్రకటించారు. తన బ్యాటింగ్‌తో ఆకట్టుకునే రహానేకు విదేశీ పిచ్‌లపై మంచి రికార్డు ఉంది. అతడు 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 8 వేలకు పైగా పరుగులు సాధించాడు. రహానే కెప్టెన్సీలో 2020-21 భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. గాయాలతో సతమతమవుతున్న భారత జట్టుకు నాయకత్వం వహించడంతో పాటు మెల్బోర్న్లో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక 2-1 టెస్టు సిరీస్ విజయాన్ని అందించారు.
Ajinkya Rahane Retirement | 2023లో చివరి టెస్ట్..
రహానే 2023లో చివరిసారిగా భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడారు. వన్డే ఫార్మాట్లో ఆయన చివరి ప్రదర్శన 2018లో ఇంగ్లాండ్‌తో జరిగింది. టీ20 ఆఖరి మ్యాచ్‌ను 2016లో వెస్టిండీస్‌తో ఆడాడు. “క్యాప్ నంబర్ 278 సెలవు తీసుకుంటోంది. ఇన్నాళ్లూ మీరు చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అని రహానే తన ఇన్స్టాగ్రామ్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కొంతకాలంగా భారత జట్టుకు దూరం అయినప్పటికి రహానే ఐపీఎల్లో ఆడుతున్నారు. రెండు సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి..: India Sri Lanka Test Squad | శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన