అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rains | తెలంగాణ (Telangana)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది.
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 117 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 83 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 97,078 క్యూసెక్కులు దిగువకు విడుదల చేనస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిండటంతో 10 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 91 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా. 10 క్రస్ట్ గేట్లను ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు 81 వేల 695 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత 7.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతుంది. జూరాల నుంచి శ్రీశైలం డ్యామ్ వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
Heavy Rains | శ్రీరామ్‌సాగర్‌కు..
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సారగ్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి ప్రస్తుతం 9200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Heavy Rains | తాలిపేరుకు వరద ఉధృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. దీంతో 24 గేట్లను ఎత్తి 98 వేల క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కడెం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 21,048 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
ఇది కూడా చదవండి..: Hyderabad new flyovers | హైదరాబాద్‌లో ట్రాఫిక్ తీర్చేందుకు కొత్త ఫ్లైఓవర్లు..రూ. 368 కోట్లతో అనుమతులు మంజూరు..మరి ఆ కీలక ప్రాంతాల సంగతేంటి?