Hyderabad egg donation racket | అండాల అమ్మకాల రాకెట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి.. ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అక్రమ దందా!

ఈ దందాలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ, యువతులకు ఇంజెక్షన్లు ఇస్తూ హార్మోన్ల అక్రమ వ్యాపారం నడుపుతున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad egg donation racket | హైదరాబాద్ మహా నగరంలో తీవ్ర కలకలం రేపిన అండాల అక్రమ రవాణా (Egg Harvesting Racket) కేసులో పోలీసుల విచారణ వేగవంతమవ్వడంతో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. బేగంపేట ఘటనతో మొదలైన ఈ దర్యాప్తు వేళ.. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరించిన ఒక ముఠా నెట్‌వర్క్‌ను పోలీసులు కనుగొన్నారు.

Hyderabad egg donation racket | 30 మంది యువతులు..

బేగంపేటతో పాటు సరూర్‌నగర్ ప్రాంతాలలో కూడా అక్రమంగా అండాలు సేకరిస్తున్న రెండు ప్రత్యేక ముఠాలను పోలీసులు ఛేదించారు. ఈ రెండు ప్రాంతాలలో కలిపి సుమారు 30 మంది యువతులను పోలీసులు సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల యువతులను, పేద ఆడపిల్లలను గుర్తించి, వారికి రకరకాల ఆశలు చూపి ఈ ముఠాలు ట్రాప్ చేస్తున్నట్లు విచారణలో తేలింది.

Hyderabad egg donation racket | హార్మోన్ల మాఫియా అరెస్టు!

అండాలను అందించే ఒక్కో యువతికి కేవలం రూ.30,000 మాత్రమే చెల్లించి, వారి శరీరం నుంచి అధిక మొత్తంలో అండాలను సేకరిస్తున్నట్లు విచారణలో తేలింది. సేకరించిన అండాలను హైదరాబాద్‌లోని ప్రధాన ఐవీఎఫ్ (IVF) సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు.. ఢిల్లీ, ముంబయి వంటి మెట్రో నగరాలకు కూడా అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు బయటపడింది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

ఈ దందాలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ, యువతులకు ఇంజెక్షన్లు ఇస్తూ హార్మోన్ల అక్రమ వ్యాపారం నడుపుతున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad egg donation racket | ముమ్మరంగా విచారణ!

మహా నగరంలో ఉన్న పలు ప్రముఖ ఐవీఎఫ్ కేంద్రాలకు, కార్పొరేట్ ఆస్పత్రులకు ఈ ముఠాతో ఎలాంటి లింకులు ఉన్నాయనే దానిపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. కనీస వైద్య నిబంధనలు పాటించకుండా యువతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రాకెట్ వెనుక ఉన్న పెద్దలను త్వరలోనే బయటకు తీస్తామని అధికారులు వెల్లడించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *