అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vaibhav Suryavanshi | ఐపీఎల్ (IPL 2026) ఎలిమినేటర్ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ (SRH) బౌలర్లను ఊచకోత కోశాడు. రికార్డుల మోత మోగించడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది.
చండీగడ్‌లో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ ఆర్ఆర్ (RR) జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. యశస్వి జైశ్వాల్‌తో పాటు ఇన్నింగ్స్ ఆరంభించిన సూర్యవంశీ తొలి ఓవర్ నుంచే బాదుడు ప్రారంభించాడు. ఒక ఎండ్‌లో జైశ్వాల్ నెమ్మదిగా ఆడుతున్న సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ (Fastest Half Centuary) రికార్డును చేరుకున్నారు. 2014లో సురేశ్ రైనా 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా తాజాగా వైభవ్ ఆ రికార్డును సమం చేశాడు.
Vaibhav Suryavanshi | సిక్స్‌ల మోత
వైభవ్ క్రీజులో ఉన్నంత వరకు బౌండరీల వర్షం కురిసింది. బాల్ పడిందంటే స్టాండ్‌లోకి పంపించడంతో ఫీల్డర్లు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. వైభవ్ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 సిక్స్‌లు, 5 ఫోర్లు బాదాడంటే ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎలా దాడి చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఒక సీజన్లో ఐపీఎల్ అత్యధిక సిక్స్‌లు కొట్టిన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. గతంలో క్రిస్ గేల్ 2012లో 59 సిక్స్‌లో కొట్టగా ఈ సీజన్లో వైభవ్ ఇప్పటి వరకు 65 సిక్స్‌లు కొట్టాడు.

Vaibhav Suryavanshi | జస్ట్‌లో సెంచరీ మిస్
మంచి ఊపు మీదున్న వైభవ్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 97 పరుగులు చేసిన తర్వాత క్యాచ్ అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 12 సిక్స్‌లు, 5 ఫోర్లతో వైభవ్ 97 పరుగులు చేయడం గమనార్హం. సూర్యవంశీ అవుట్ అయ్యాక జైశ్వాల్ సైతం 29 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
Vaibhav Suryavanshi | జురెల్ కీలక ఇన్నింగ్స్
వైభవ్ సూర్యవంశీ, జైశ్వాల్ అవుట్ అయ్యాక కెప్టెన్ రియాన్ పరాగ్‌తో కలిసి ద్రువ్ జురెల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 20 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ప్రఫుల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అనంతరం రియాన్ పరాగ్ 12 బంతుల్లో 26 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. శనక 5 పరుగులకే వెనుతిరిగాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో భారీ స్కోర్ చేసే అవకాశాన్ని రాజస్థాన్ కోల్పోయింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో పాట్ కమిన్స్ 64 పరుగులు ఇచ్చాడు. ప్రఫుల్ మూడు వికెట్లు, ఇషాన్ మలింగ ఒక వికెట్ తీశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసి, హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి ఐదు ఓవర్లలో రాజస్థాన్ 36 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. లేదంటే మరింత స్కోర్ చేసేది.
The Vaibhav Sooryavanshi show in the Eliminator 🤌pic.twitter.com/McqWs94K3B
— ESPNcricinfo (@ESPNcricinfo) May 27, 2026
దీనిని కూడా చదవండి : Assam UCC Bill | దేశంలో మూడో రాష్ట్రంగా అస్సాం.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం


