India vs Sri Lanka | సెమీస్​లో భారత్​ ఘన విజయం.. పసిడి కోసం పాక్​తో పోరు

ఆసియా క్రీడల్లో భాగంగా సెమీస్​లో శ్రీలంకను ఓడించిన భారత క్రికెట్ జట్టు ఫైనల్​లోకి అడుగు పెట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: India vs Sri Lanka | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్​లో శ్రీలంకను చిత్తుగా ఓడించింది.శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్​లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పిచ్​ కఠినంగా ఉండటంతో భారత బ్యాటర్లు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. వైభవ్​ సూర్యవంశీ 38, ఇషాన్​ కిషన్ 80 పరుగులతో రాణించడంతో భారత్ 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 45 పరుగులకే ఆలౌట్ అయింది.

India vs Sri Lanka | ఐదుగురు డకౌట్​

భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్​మన్​ విలవిలలాడారు. పరుగుల ఖాతా ఓపెన్ చేయకుండానే లంక జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్​ బుమ్రా తొలి ఓవర్​లోనే ఇద్దరిని ఔట్​ చేశాడు. అనంతరం ఏ దశలోనూ శ్రీలంక కోలుకోలేకపోయింది. పరుగులు చేయడానికి బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆ జట్టు 45 పరుగులకే ఆలౌట్​ అయింది. భారత్​ 124 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుమ్రా, అక్షర్​ పటేల్, అభిషేక్​ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.

India vs Sri Lanka | దాయాదితో పసిడి పోరు

మరో సెమీస్​లో బంగ్లాదేశ్​పై పాకిస్థాన్​ విజయం సాధించింది. దీంతో ఫైనల్​లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాక్​తో తలపడనుంది. పసిడి కోసం ఈ మ్యాచ్​ శనివారం జరగనుంది. దీంట్లో గెలిస్తే భారత్ పసిడి పతకం గెలుచుకుంటుంది. ఇప్పటికే మహిళల క్రికెట్​ జట్టు గోల్డ్ మెడల్ సాధించింది.

ఇది కూడా చదవండి..: India vs Sri Lanka | హాఫ్​ సెంచరీతో రాణించిన ఇషాన్​.. శ్రీలంక టార్గెట్​ 170

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *