అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India vs Sri Lanka | ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సెమీ ఫైనల్లో భారత జట్టు 169 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు చేయలేకపోయింది.
టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చారు. అభిషేక్ 7 పరుగులకే వెను తిరిగాడు. సంజూ శాంసన్ సైతం 7 పరుగులకే ఔట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పోతున్న వైభవ్ లంక బౌలర్లపై విరుచుపడ్డాడు. 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు.
India vs Sri Lanka | ఇషాన్ హాఫ్ సెంచరీ
వైభవ్ ఔట్ అయ్యాక ఇషాన్ కిషాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు అవుట్ అవుతున్నా.. నిలకడగా ఆడుతూ భారత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. శ్రేయాస్ అయ్యార్ 13, అక్షర్ పటేల్ 8, తిలక్ వర్మ 2, దూబే 3 పరుగులు మాత్రమే చేశారు. ఇషాన్ కిషన్ 80 పరుగులతో రాణించడంతో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఫైనల్‌కు చేరుతుంది. అక్కడ గెలిస్తే బంగారు పతకం దక్కుతుంది. కాగా మహిళల టీ 20లో ఇప్పటికే భారత జట్టు పసిడి గెలుచుకుంది.
ఇది కూడా చదవండి..: IND vs WI ODI | హిస్టారికల్ ఛేజింగ్.. విండీస్‌పై భారత్ ఘన విజయం!..రికార్డుల తుపాను సృష్టించిన శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ