అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs SL | ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
భారత్–ఏ, శ్రీలంక–ఏ, అఫ్గానిస్థాన్ –ఏ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో వైభవ్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. శ్రీలంక, భారత్ మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట టై అయిన ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో శ్రీలంక గెలుపొందింది. అయితే ఆ సమయంలో శ్రీలంక క్రికెటర్లు, భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్లో వైభవ్ రెచ్చిపోయి ఆడాడు.
IND vs SL | 11 బంతుల్లో హాఫ్ సెంచరీ
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆర్య నెమ్మదిగా ఆడినా.. వైభవ్ మాత్రం రెచ్చిపోయాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూయించాడు. 11 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఆ పరుగులు కూడా అన్ని బౌండరీలో రూపంలో రావడం గమనార్హం. 29 బంతుల్లో 94 పరుగులు చేసి వైభవ్ ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 8.5 ఓవర్లలో 132 పరుగులు. అనంతరం మిగతా బ్యాటర్లు కాస్త నెమ్మదిగా ఆడటంతో స్కోర్ వేగం తగ్గింది.
IND vs SL | తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్

వైభవ్ ఔట్ అయిన తర్వాత శ్రీలంక బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయిన భారత బ్యాటర్లు వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ప్రియాన్స్ ఆర్య 29 బంతుల్లో 39 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 51 బంతుల్లో 40 పరుగులు చేశాడు. వికెట్లు పోవడంతో కెప్టెన్ తిలక్‌వర్మ నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 90 బంతుల్లో 67 పరుగులు చేశాడు. కుమార్ కుశాగ్ర 36, విప్రజ్ నిగమ్ 27 పరుగులతో రాణించారు.
చివర్లో అంకుల్ రాయ్ 15 బంతుల్లో 39 పరుగులతో సత్తా చాటాడు.వైభవ్ బ్యాటింగ్ చేసే సమయంలో భారత్ 400 పరుగులు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే అతడు ఔట్ అయ్యాక స్కోర్ బోర్డు నెమ్మదించింది. దీంతో 50 ఓవర్లలో భారత్ 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో రవింద్ ఫెర్నాండో, వనుజ షాహన్ చెరో రెండు వికెట్లు తీశారు.
Vaibhav suryavanshi yet again pic.twitter.com/a2DJfLi2LF
— Srinivas singer (@singersrinivas) June 21, 2026
ఇది కూడా చదవండి..: Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ వీర విహారం