అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vaibhav Suryavanshi | ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. శ్రీలంక బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
భారత్–ఏ, శ్రీలంక–ఏ, అఫ్గానిస్థాన్ –ఏ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడగా రెండింట్లో గెలిచి ఫైనల్‌కు చేరింది. శ్రీలకం మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే శ్రీలంక, భారత్ మధ్య జరిగిన గత మ్యాచ్లో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట టై అయిన ఆ మ్యాచ్లో సూపర్ ఓవర్లో శ్రీలంక గెలుపొందింది. అయితే ఆ సమయంలో శ్రీలంక క్రికెటర్లు, భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్లో వైభవ్ రెచ్చిపోయి ఆడాడు.
Vaibhav Suryavanshi | జస్ట్‌లో సెంచరీ మిస్

ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆర్య నెమ్మదిగా ఆడినా.. వైభవ్ మాత్రం రెచ్చిపోయాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూయించాడు. 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. సెంచరీకి 6 పరుగుల దూరంలో వైభవ్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 8.5 ఓవర్లలోనే 132 పరుగులు చేసింది.
Vaibhav sooryavanshi smashed 50 in just 11 balls against Srilanka in the final of tri series with 5 fours and 5 six , strike rate of 454 🤯pic.twitter.com/6zKxAySzYv
— Kartik Sharma (@KartikSharmaFC) June 21, 2026
ఇది కూడా చదవండి..: India vs Afghanistan ODI | అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం