అక్షరటుడే వెబ్‌డెస్క్: India Hockey Jersey | బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా త్వరలో జరగనున్న పురుషుల హాకీ ప్రపంచ కప్ నేపథ్యంలో, భారత జాతీయ జట్ల జెర్సీ రంగును నీలం నుంచి కాషాయ రంగులోకి మార్చడం చర్చనీయాంశమైంది. ఈ మార్పుపై విమర్శలు రావడంతో ‘హాకీ ఇండియా’ స్పందించి అధికారికంగా స్పష్టతనిచ్చింది. మైదానంలో ఆటగాళ్లు స్పష్టంగా కనిపించేందుకే రంగు మార్చాల్సి వచ్చిందని వెల్లడించింది.
India Hockey Jersey | చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం ..
ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో సమగ్రంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాకీ ఇండియా తెలిపింది. అంతర్జాతీయ హాకీ పిచ్‌లకు ప్రస్తుతం ప్రామాణికంగా ఉన్న బ్లూ సింథటిక్ ఉపరితలంతో మన ఆటగాళ్ల బ్లూ జెర్సీ కలిసిపోయినట్లుగా ఉందని, దీనివల్ల మైదానంలో ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని వివరించింది. ఈ క్రమంలో కోచ్‌లు, ఆటగాళ్లు పసుపు లేదా కాషాయం వంటి ప్రత్యామ్నాయ రంగులను సూచించారని పేర్కొంది.
India Hockey Jersey | సాంకేతికంగానూ ఉత్తమంగా..
అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కాషాయ రంగును ఫైనల్ చేసినట్లు వెల్లడించింది. మన జాతీయ పతాకంలోని రంగులలో ఒకటైన కాషాయం.. ధైర్యం, త్యాగం, జాతీయ గౌరవానికి ప్రతీక కావడంతో దీన్ని ఎంచుకున్నామని, సాంకేతికంగానూ ఇది ఉత్తమంగా అనిపించిందని తెలిపింది. అంతేకాకుండా, భారత హాకీ జట్టు జెర్సీ రంగులను మార్చడం కొత్తేమీ కాదని, గతంలో 2014 ప్రపంచ కప్ సమయంలో పసుపు రంగులోకి, 2018 వరల్డ్ కప్ వేళ స్కై బ్లూలోకి మార్చిన విషయాన్ని గుర్తుచేసింది.
India Hockey Jersey | ప్రపంచ కప్ షెడ్యూల్ ..
ఈ సంవత్సరం పురుషుల హాకీ ప్రపంచ కప్ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనుంది. ‘పూల్ డి’లో ఉన్న భారత జట్టు ఆగస్టు 15న వేల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 17న ఇంగ్లాండ్‌తో, 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. చివరగా 2023లో జరిగిన వరల్డ్ కప్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్కసారి మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది. 1975లో పాక్‌ను ఓడించి విజేతగా అవతరించింది. అంతకుముందు 1971లో కాంస్యం, 1973లో రజతం దక్కించుకుంది.
Hockey India President Dilip Tirkey-
No pressure behind saffron jersey move, players and coaches sought change for visibility.
A new saffron jersey has been launched for the World Cup.
Technically, when the team plays on a blue turf, the blue jersey creates visibility-related… pic.twitter.com/1oMM9Vb72j
— News Arena India (@NewsArenaIndia) July 30, 2026
ఇది కూడా చదవండి: Stock Market Closing Today | హెవీవెయిట్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు.. లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు