PhonePe Fraud | వ్యాపారులే టార్గెట్.. ఫోన్‌పే ద్వారా రూ.45 వేలు బురిడీ కొట్టించిన కేటుగాడు..

అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త తరహాలో డిజిటల్ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: PhonePe Fraud | అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త తరహాలో డిజిటల్ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎదురుగా ఉన్న షాపు యజమానినంటూ, తెలిసిన వ్యక్తినంటూ ఫోన్ చేసి, ఆసుపత్రి అత్యవసరాల పేరుతో నమ్మించి ఫోన్‌పే ద్వారా డబ్బులు కాజేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

PhonePe Fraud | షాపు యజమానినంటూ ఫోన్లు ..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 26న తిరుమలగిరిలోని దివ్య ఐరన్ అండ్ హార్డ్‌వేర్ షాపు యజమానికి ఫోన్ చేసిన నిందితుడు, తమ ఎదురుగా ఉండే మాతాజీ ఎలక్ట్రికల్స్ యజమానిగా పరిచయం చేసుకున్నాడు. అర్జెంట్‌గా డబ్బులు కావాలని నమ్మించి ఫోన్‌పే స్కానర్ ద్వారా రూ.30,000 కాజేశాడు. అదే రోజు శ్రీ రామాంజనేయ బోర్‌వెల్స్ యజమానికి కాల్ చేసి, అభి వెల్డింగ్ వర్క్స్ యజమాని అభినని నమ్మించి, ఆసుపత్రి ఖర్చుల పేరుతో మరో రూ.15,000 దోచుకున్నాడు. ఇలా ఇద్దరు వ్యాపారుల నుంచి మొత్తం రూ.45 వేలు కాజేసినట్లు గుర్తించారు.

PhonePe Fraud | జైలుకు తరలింపు..

ఈ మోసాలకు పాల్పడిన నిందితుడిని హైదరాబాద్‌లోని  ( Hyderabad )హయత్‌నగర్ బంజారా కాలనీకి చెందిన కారు డ్రైవర్ కేతావత్ రాజేష్ (27)గా పోలీసులు గుర్తించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న తిరుమలగిరి పోలీసులు, నవంబర్ 5న తుంగతుర్తి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని సూర్యాపేట జైలుకు తరలించినట్లు ఎస్సై గుత్తా వెంకట్ రెడ్డి తెలిపారు.

PhonePe Fraud | పోలీసుల హెచ్చరిక..

గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బంధువులమని, పక్క షాపు యజమానులమని లేదా తెలిసిన వ్యాపారులమని చెప్పి అత్యవసరంగా డబ్బులు అడిగితే వెంటనే నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఫోన్ చేసిన వ్యక్తి అసలైనవాడో కాదో నేరుగా ఆ సంబంధిత వ్యక్తికి స్వయంగా కాల్ చేసి నిర్ధారించుకున్న తర్వాతే డబ్బులు పంపాలని, ఫోన్‌పే , ఇతర యూపీఐ (UPI) చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:  Yellareddy Government Hospital | వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే మదన్​మోహన్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *