Delhi Air Pollution | ఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. గాలి నాణ్యత పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi Air Pollution | ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమైంది. గాలినాణ్యత 387కు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్య సంక్షోభంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతూ పంట వ్యర్థాల సేకరణ ధరను చాలా ముందుగానే ప్రకటించాలని, దాని నిర్వహణ వ్యవస్థను పంచాయతీలకు అందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్‌లు జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్​పై విచారణ చేపట్టింది. మీరందరూ ఢిల్లీలోని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని నేను ఆశిస్తున్నాను అని ప్రధాన న్యాయమూర్తి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఎన్ని ఆదేశాలు ఇస్తున్నా.. పాటించకపోవడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోందన్నారు.

Delhi Air Pollution | 30 సిగరెట్లు తాగడంతో సమానం..

సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీగా సహాయం చేస్తున్న సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ వాదనలు వినిపిస్తూ.. వాయు కాలుష్యం తీవ్రంగా ఉందన్నారు. ఆ ప్రాంతంలోని గాలిని పీల్చడం ఒక వ్యక్తి “ప్రతిరోజూ 30 సిగరెట్లు తాగడంతో” సమానం అని ఆమె అన్నారు. ఢిల్లీ కాలుష్య స్థాయిలకు పంట వ్యర్థాలను కాల్చడం 14 శాతం దోహదపడుతోందని అన్నారు. పంట వ్యర్థాలను కాల్చడంతో పాటు, చెత్తను కాల్చడం వంటి స్థానిక కాలుష్యాన్ని కూడా ఆపడానికి తక్షణ జోక్యం అవసరమని పేర్కొన్నారు.

Delhi Air Pollution | వాహనాలు సైతం..

పంట గడ్డిని కాల్చడంతో పాటు వాహనాల నుండి వెలువడే ఉద్గారాలు కూడా వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, పంట వ్యర్థాలను కాల్చడం (స్టాల్-బంపర్) సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ఒక పథకం అమలులో ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని వివరించారు.

ఇది కూడా చదవండి..: Agniveer Service Extension | ‘అగ్నివీర్’​ పదవీకాలం పెంపు.. వారికి మాత్రమే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *