అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Government Hospital | వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madan Mohan) అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు రావడంతో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Yellareddy Government Hospital | రికార్డుల పరిశీలన
వైద్యులు, నర్సింగ్ సిబ్బంది విధులకు హాజరవుతున్న తీరును, హాజరు రికార్డులను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమయపాలన పాటించాలని, రోగులకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా అందుతున్నాయి..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Yellareddy Government Hospital | పారిశుధ్యంపై ఆరా..
ఆస్పత్రి పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై కూడా ఆరా తీసి, ఆస్పత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి పేద రోగికి మెరుగైన వైద్యం అందించడం అధికారుల బాధ్యతని, రోగులతో మానవీయంగా వ్యవహరిస్తూ సేవలు అందించాలని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: BC Atma Gaurava Bhavan | బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నిధుల విడుదలపై హర్షం