అక్షరటుడే, నార్సింగి: Munnurukapu Atma Gaurava Bhavan | మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5కోట్లు మంజూరు చేయడంపై మున్నూరుకాపు కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)ను పలువురు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనను సన్మానించారు.
Munnurukapu Atma Gaurava Bhavan | ఘనంగా సన్మానం..
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌ను వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు కార్పొరేషన్ ఛైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, నరాల రత్నాకర్, గాలి అనిల్ కుమార్, కొలగాని మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Husband Murder Case | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ