అక్షరటుడే, ఇందూరు: BC Atma Gaurava Bhavan | హైదరాబాద్‌లో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
BC Atma Gaurava Bhavan | ప్రతి బీసీ కులానికి రూ.5 కోట్ల చొప్పున..
ప్రతిఒక్క బీసీ కులానికి రూ.5కోట్ల చొప్పున దాదాపు రూ.88 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌కు బీసీ సంక్షేమ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నరాల సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో బీసీల కోసం ఒక ఆత్మ గౌరవ భవనం ఏర్పాటు అనేది బీసీలందరూ గర్వంచదగ్గ విషయమన్నారు. బీసీలకు ప్రభుత్వాలు ఎల్లవేళలా వెన్నుదన్నుగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కొయ్యాడ శంకర్, సాయి బసవ, పోతుగంటి గంగాధర్, దేశాయి గంగాధర్, సత్యనారాయణ, హన్మాండ్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Father Daughter Death | కామారెడ్డిలో విషాదం.. దిష్టితీసిన వస్తువులు పడేయడానికి వెళ్లి తండ్రి, కూతురు మృతి