Kamareddy Father Daughter Death | కామారెడ్డిలో విషాదం.. దిష్టితీసిన వస్తువులు పడేయడానికి వెళ్లి తండ్రి, కూతురు మృతి

మూఢనమ్మకాలు మనుషుల జీవితాలను ఆగం చేస్తున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Father Daughter Death | మూఢనమ్మకాలు మనుషుల జీవితాలను ఆగం చేస్తున్నాయి. దిష్టితీసిన వస్తువులు చెరువులో పడేసేందుకు వెళ్లిన తండ్రీకూతుళ్లు విగతజీవులయ్యారు. ఈ విషాద ఘటన కామారెడ్డి మండలం లింగాయిపల్లి సమీపంలోని కొటాల్‌పల్లి చెరువులో చోటుచేసుకుంది.

Kamareddy Father Daughter Death | అల్లుడికి బాగా లేదని దిష్టితీసి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి మండలం లింగాయిపల్లికి చెందిన సోమిశెట్టి రజిత భర్త మల్లేశం రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో దిష్టి తీయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అందుకోసం టేక్రియాల్‌ గ్రామానికి చెందినరజిత తండ్రి సుంకరి పెద్దనర్సయ్య గురువారం కూతురు ఇంటికి లింగాయిపల్లికి వచ్చాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో మల్లేశంకు దిష్టితీశారు. అనంతరం దిష్టి తీసిన వస్తువులను చెరువులో పడేయడానికి రజిత, ఆమె తండ్రి పెద్ద నర్సయ్య సమీపంలోని కొటాల్‌పల్లి చెరువు వద్దకు వెళ్లారు.

చెరువులో దిష్టి పడేస్తున్న క్రమంలో అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు ఇద్దరూ చెరువులో పడిపోయారు. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు ఇద్దరూ మృతి చెందారు. శుక్రవారం ఉదయం చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడికి ఆరోగ్యం బాగాలేదని దిష్టి తీయిస్తే ఇద్దరు మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇది కూడా చదవండి: SIR వ్యతిరేక నిరసనకు రండి.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *