అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Fee Reimbursement | రాష్ట్రవ్యాప్తంగా(Telangana) విద్యార్థులకు ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని బీజైవైఎం(BJYM Telangana) జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్ పేర్కొన్నారు. ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ కార్యక్రమంలో భాగంగా కిట్స్ (KITS) కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
Fee Reimbursement | కిట్స్ కళాశాలలో..
వంశీ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ ఉద్యమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కళాశాలల్లో ప్రత్యక్షంగా విద్యార్థులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని,మిస్డ్ కాల్ (Missed Call), క్యూఆర్‌కోడ్ (QR Code Scan) ద్వారా సంతకం చేసి విద్యార్థుల న్యాయమైన డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Fee Reimbursement | ఏళ్లుగా పెండింగ్‌లో బకాయిలు
బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఫీజులు చెల్లించలేక వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, కొంతమంది విద్యార్థులు అప్పులు చేసి చదువులు కొనసాగించే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు విపుల్ రావు, రాజ్ గణేష్, రాకేష్, సిసింద్రీ, రాజశేఖర్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ