Nizamabad Streams Overflow | జిల్లాలో వాగులకు జలకళ.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Streams Overflow | జిల్లాలో(Nizamabad) వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎల్​నినో ప్రభావంతో ఈ సీజన్​లో వర్షాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఖరీఫ్​కు సిద్ధమైన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Nizamabad Streams Overflow | వానాకాలం ప్రారంభమైన తర్వాత..

నగర శివారులోని ఆకుల కొండూర్​లో చెరువు అలుగు పారుతోంది. వానాకాలం (Monsoon in Telangana) ప్రారంభమైన తర్వాత మొదటిసారి అలుగు పారుతుండడంతో స్థానికులు, నగరవాసులు  చూసేందుకు తరలివస్తున్నారు. అలాగే కాలూర్​–ఖానాపూర్​కు వెళ్లే రోడ్డుపై ఉన్న వంతెనను తగులుతూ వరద ప్రవహిస్తోంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఈ కాలువ పొంగుతోంది. దీంతో ఈ వంతెనకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలు జలమయమయ్యాయి.

avaa

ఇది కూడా చదవండి: నిజామాబాద్​ జిల్లాలో విస్తారంగా వర్షాలు.. వాగులకు జలకళ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *