Brain Stroke | బ్రెయిన్​ స్ట్రోక్​తో హెడ్​ కానిస్టేబుల్​ మృతి

shashi kiran Mottala
Constable Brain Stroke | బ్రెయిన్​ స్ట్రోక్​తో కానిస్టేబుల్​ మృతి

అక్షరటుడే, డిచ్​పల్లి: బ్రెయిన్​ స్ట్రోక్​తో (Brain Stroke) హెడ్​ కానిస్టేబుల్​ మృతి చెందారు. ఈ ఘటన ధర్పల్లిలో చోటు చేసుకుంది.

Brain Stroke | అనారోగ్యంతో బాధపడుతూ..

ధర్పల్లి (Dharpally) పోలీస్​స్టేషన్​లో హెడ్​కానిస్టేబుల్​గా (Head Constable) పనిచేస్తున్న ఎస్.నర్సయ్య శనివారం రాత్రి బ్రెయిన్​ స్టోక్​తో మృతి చెందారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి శనివారం స్ట్రోక్​ రావడంతో శనివారం మృతి చెందారు. దీంతో కానిస్టేబుల్​ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. ధర్పల్లి ఎస్సై, పోలీస్​స్టేషన్​ సిబ్బంది (Dharpally police) ప్రగాఢ సానుభూతి తెలిపారు. సౌమ్యుడిగా పేరున్న ఆయన అకాలమరణం (Nizamabad News) చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సయ్యకు నివాళులర్పించారు.

Telangana police

ఇది కూడా చదవండి: SI Suspended | అన్న అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్సై.. సస్పెండ్​ చేసిన అధికారులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *