Police Surveillance System | జిల్లాలో పోలీసు నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలి : డీఐజీ భాస్కరన్​

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో పోలీసు నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని బాసర జోన్​–2 డీఐజీ భాస్కరన్ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Police Surveillance System | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ (Nizamabad Police) పరిధిలో పోలీసు నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని బాసర జోన్​–2 డీఐజీ భాస్కరన్ (DIG Bhaskaran) పేర్కొన్నారు. శనివారం బోధన్​(Bodhan)పోలీస్​స్టేషన్​ను ​ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Police Surveillance System | రికార్డుల పరిశీలన

మొదటగా స్టేషన్‌లో సిబ్బందికి అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు డీఐజీ సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. స్టేషన్‌లో అమలవుతున్న ‘5 ఎస్ విధానం’ తీరును సమీక్షించారు. మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని స్పందించాలని తెలిపారు.

Police Surveillance System | ​ సరిహద్దులో ఉన్నందున..

బోధన్ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున అన్ని ప్రధాన రహదారులపై నిఘా పటిష్టపరిచాలని ఆదేశించారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్​ఫోర్స్​మెంట్​ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్​లైన్​ బెట్టింగ్స్, ఆన్​లైన్​ గేమ్స్ ఆడుతూ సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతున్నారన్నారు. వాటిని నిలువరించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఎస్​హెచ్​వో వెంకటనారాయణ, బోధన్ ట్రాఫిక్ ఎస్సై మహేష్, బోధన్ టౌన్ ఎస్సై హబీబ్ ఖాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

reat

ఇది కూడా చదవండి: Morbi Well Water | అలల్లా కదలాడుతున్న నీరు..బావిని బిందెలా ఊపుతున్నారా..?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *