Constable Pramod | కానిస్టేబుల్​ ప్రమోద్ ​పిల్లల విద్యాభ్యాసానికి టెర్మినల్​ గ్రూప్​ ఆర్థికసాయం

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Constable Pramod | నగరంలో రౌడీషీటర్​ రియాజ్​ దాడిలో హత్యకు గురైన కానిస్టేబుల్​ ప్రమోద్​ కుటుంబానికి చేయూతనిచ్చేందుకు టెర్మినల్​ గ్రూప్​ ముందుకొచ్చింది. ప్రమోద్​ పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం ప్రకటించింది.

Constable Pramod | డీజీపీ కార్యాలయంలో..

హైదరాబాద్​లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్​ రెడ్డి (DGP Shivadhar Reddy) ప్రమోద్​ తల్లికి, సతీమణికి చెక్కును అందజేశారు. టెర్మినల్​ గ్రూప్​ సీఎండీ ఎస్పీ రెడ్డి తండ్రి ఎస్​ఎల్​ఎన్​ రెడ్డి బోధన్​లో గతంలో డీఎస్పీగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమోద్​ కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించడంతో ఎస్పీ రెడ్డి స్పందించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇద్దరు పిల్లల ఫీజలకు సంబంధించిన మొత్తాన్ని చెక్​ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement | దొడ్డురకం ధాన్యం సేకరణలో ఇబ్బందుల్లేకుండా చూడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *