Bike Theft Gang | అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠా అరెస్ట్

జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్​జిల్లా బైక్​ దొంగల ముఠాను సదాశివనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Bike Theft Gang | జిల్లాలో(Kamareddy) చోరీలకు పాల్పడుతున్న అంతర్​జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠాను సదాశివనగర్ పోలీసులు (Sadashivanagar Police) అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి నాలుగు బైక్​లు స్వాధీనం చేసుకున్నారు.

Bike Theft Gang | ప్రత్యేక బృందాలతో దర్యాప్తు..

సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన హనుమంత్ రాజు గత నెల 24వ తేదీ రాత్రి తన బజాజ్ పల్సర్ బైక్​ను ఇంటి ముందు పార్క్ చేశారు. మరుసటి రోజు ఉదయం బైక్ కనిపించకపోవడంతో ఆయన సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి రెండు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను పరిశీలించగా షేక్ ఇమ్రాన్, అద్నాన్ ఖాన్, సయ్యద్ జుబేర్, షేక్ అయాన్, సచిన్ విశ్వనాథ్ ఖండేవాల్ కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఇమ్రాన్, అద్నాన్ ఖాన్‌లు అద్నాన్‌కు చెందిన టీవీఎస్ రైడర్ బైక్‌పై హోటళ్లు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్ల వద్ద పార్క్ చేసిన బైక్‌లను గుర్తించేవారు. అనుకూలమైన వాహనాన్ని చూసి దొంగిలించి జుబేర్, అయాన్, సచిన్‌లకు తక్కువ ధరకు విక్రయించేవారు.

Bike Theft Gang | పోలీసులకు దొరక్కుండా..

అసలు నంబర్ ప్లేట్లను తొలగించి నకిలీ నంబర్లు అమర్చి పోలీసులకు దొరకకుండా ముఠా సభ్యులు తిరిగేవారు. ఆ తర్వాత వాటిని ఎక్కువ ధరకు అమ్మి లాభపడేవారు. సదాశివనగర్‌లో హనుమంత్ రాజు బైక్‌ను ఇమ్రాన్, అద్నాన్ రూ.7వేల సచిన్‌కు అమ్మినట్లు, సచిన్ నకిలీ నంబర్ ప్లేట్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. శనివారం పద్మాజీవాడి ఎక్స్ రోడ్ బ్రిడ్జి వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు నిందితులను గుర్తించారు. జుబేర్, అయాన్, సచిన్ నకిలీ నంబర్​లున్న పల్సర్ బైక్‌లపై వెళ్తుండగా, ఇమ్రాన్, అద్నాన్ మరో బైక్‌ను దొంగిలించి హైదరాబాద్‌లో అమ్మేందుకు వెళ్తున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంబడించి అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *