Shabbir Ali Farmhouse | షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ కాంపౌండ్ కూల్చివేత..

నార్సింగి మండలం జాప్తి శివనూరు గ్రామంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చెందిన ఫార్మ్ హౌస్ పై ఆ గ్రామస్తులు దాడి చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Shabbir Ali Farmhouse | నార్సింగి మండలం జాప్తి శివనూరు గ్రామంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali)కి చెందిన ఫార్మ్ హౌస్​ ప్రహరీపై ఆ గ్రామస్థులు దాడి చేశారు. తమ పంట పొలాలకు వెళ్లకుండా దారిలో ఫార్మ్ హౌస్ ప్రహరీని కట్టారని ఆరోపిస్తూ గ్రామస్థులు కాంపౌండ్ గోడను కూల్చివేశారు.

Shabbir Ali Farmhouse | పలుమార్లు షబ్బీర్ అలీకి విన్నవించినప్పటికీ..

Shabbir Ali Farmhouse

ఈ విషయాన్ని పలుమార్లు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లినప్పటికి స్పందించలేదని గ్రామస్థులు ఆరోపించారు. తమ పొలాల్లోకి వెళ్లే దారి లేక, షబ్బీర్ అలీ నుంచి స్పందన రాకపోవడంతో కాంపౌండ్ కూల్చేయడం జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఇకనైనా తమ పొలాల్లోకి దారి ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వరుస వివాదాలు షబ్బీర్ అలీని చుట్టుముడుతుండగా తాజాగా ఈ ఘటన ఎటువైపు దారి తీస్తుందోనన్న చర్చ సాగుతోంది. అయితే కాంపౌండ్ కూల్చివేసిన ఘటనపై ఇప్పటి వరకు షబ్బీర్ అలీ స్పందించలేదు. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: Quality Education Healthcare | విద్యావైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *