Quality Education Healthcare | విద్యావైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Quality Education Healthcare | దేశంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్యావైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాన్సువాడ పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.

Quality Education Healthcare | ప్రతి విద్యార్థికి కార్పొరేట్​ విద్య..

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మ అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య, వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి యువకుడికి ఉపాధి కల్పించాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రైతులు (Farmers) పండించే అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ వారు సాధించుకున్న కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు.

Quality Education Healthcare | మహిళా రిజర్వేషన్ల అమలులో..

మహిళా రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ, మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, అవినీతి, కార్పొరేట్ అనుకూల విధానాలను విడనాడి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే పాలనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని పశ్య పద్మ కోరారు. కార్యక్రమంలో సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుబాస్ రాములు, డి. శంకర్, శ్రీనివాస్, గంగాధర్, ఎల్లయ్య, అబ్రహం, సర్దార్, అశోక్ గౌడ్, శివాజీ, అడబల్లి రాజు, పోశెట్టి, మాధవరావు, బసవంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: RTC Bus Mud Road | బురదలో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు కష్టాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *