RTC Bus Mud Road | బురదలో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు కష్టాలు

కామారెడ్డి నుంచి అన్నారం వెళ్లే దారిలో అడ్లూర్ రోడ్డులో బురదలో బస్సు దిగబడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : RTC Bus Mud Road | గ్రామీణ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన. సరిగ్గా పది రోజుల క్రితం ఏ ప్రాంతంలో అయితే ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన బురదలో దిగబడిందో మళ్ళీ అదే ప్రాంతంలో మరో బస్సు దిగబడటం చర్చనీయాంశంగా మారింది.

RTC Bus Mud Road | కామారెడ్డి నుంచి అన్నారం..

కామారెడ్డి (Kamaeddry) నుంచి అన్నారం వెళ్లే దారిలో రామారెడ్డి గంగమ్మ వాగు బ్రిడ్జి వర్షాల నేపథ్యంలో ప్రమాదకరంగా మారింది. ఆ దారి గుండా బైకులు మినహా భారీ వాహనాలకు పోలీసులు అనుమతించడం లేదు. దాంతో పోసానిపేట, అడ్లూర్ గ్రామాల మీదుగా 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల 29 న గిద్ద వెళ్లాల్సిన బస్సు అడ్లూర్ రోడ్డులో రోడ్డు పక్కన బురదలో ఇరుక్కుపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో అన్నారం వెళ్లే బస్సు బురదలో ఇరుక్కోగా కండక్టర్​కు స్వల్ప గాయాలయ్యాయి.

RTC Bus Mud Road

RTC Bus Mud Road | మొదటిసారి బస్సు దిగబడినప్పుడే..

మొదటిసారి బస్సు దిగబడినప్పుడే రోడ్డు బాగు చేయాలని ప్రయాణికులు మొరపెట్టుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇవాళ మరొక బస్సు దిగబడాల్సిన పరిస్థితి నెలకొంది. వరుస ఘటనల నేపథ్యంలోనైనా రామారెడ్డి గంగమ్మ వాగుపై రోడ్డు వేసి దారిని పునరుద్ధరించాలని, రహదారి పక్కన ప్రమాదకరంగా మారుతున్న మట్టి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Sriramsagar Project Flood | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *