IAF Officer Honeytrap | ఐఏఎఫ్​ అధికారి హనీట్రాప్​.. పాక్​కు రహస్యాల చేరవేత

భారత వైమానిక దళానికి చెందిన ఓ అధికారి హనీట్రాప్​ అయ్యాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: IAF Officer Honeytrap | భారత వైమానిక దళానికి చెందిన ఓ అధికారి హనీట్రాప్​ అయ్యాడు. అంతేగాకుండా భారత రహస్యాలను పాక్​ చేరవేశాడు. అతడిని ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు.

భారత వైమానిక దళానికి చెందిన ఒక వింగ్ కమాండర్​ను అరెస్టు చేశారు. అతనిపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత సైన్యం, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక సమాచారాన్ని పొందడమే లక్ష్యంగా ఉన్న ఒక పెద్ద గూఢచర్య నెట్‌వర్క్‌లో అతను భాగమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

IAF Officer Honeytrap | మహిళతో చాటింగ్​..

IAF Officer Honeytrap

సదరు వింగ్ కమాండర్ తన వ్యక్తిగత జీవితంలో కష్టకాలం ఎదుర్కొంటున్నప్పుడు సోషల్ మీడియాలో ఒక మహిళతో చాటింగ్ చేయడం ప్రారంభించారు. అనంతరం వారి పరిచయం వీడియో కాల్స్ వరకు వెళ్లింది. అనంతరం ఆమె సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అడగడం ప్రారంభించింది. సైనిక యూనిట్ల కదలికలు, మోహరింపుల వివరాలతో పాటు ఇతర సున్నితమైన సమాచారాన్ని కూడా ఆ మహిళతో ఆయన పంచుకున్నారని సమాచారం. ఆ మహిళ ఒక పాకిస్తానీ గూఢచార సంస్థ కోసం పనిచేస్తోందని, ఆ అధికారి హనీ ట్రాప్‌కు గురయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు అధికారి ప్రస్తుతం తీహార్​ జైలులో ఉన్నాడు.

ఇది కూడా చదవండి..: Fake Paneer Ban | ఫేక్​ పనీర్​పై బ్యాన్​.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ చర్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *