Bhagwant Mann | పంజాబ్​ సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్​

పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​ రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhagwant Mann | పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​ రాజీనామా చేయాలని బీజేపీ (BJP) నాయకులు డిమాండ్​ చేశారు. అత్యాచార కేసును అణచివేసేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భార్య గుర్​ప్రీత్ కౌర్ రూ.5 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి (Bhagwant Mann) రాజీనామా చేయాలని శిరోమణి అకాలీ దళ్, కాంగ్రెస్‌తో సహా పంజాబ్‌లోని ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా డిమాండ్ చేశారు.

అత్యాచార కేసును అణచివేసేందుకు మాన్ భార్య రూ. 5 కోట్లు డిమాండ్ చేశారన్న ఫిర్యాదుపై NHRC పంజాబ్ ప్రభుత్వానికి, అక్కడి పోలీస్ చీఫ్‌కు నోటీసు పంపింది. ముఖ్యమంత్రి భార్య ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపించబడుతున్న ఒక అత్యాచార కేసు విషయంలో రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని ఒక రిటైర్డ్ న్యాయమూర్తి బహిరంగంగా చెప్పారని ఫిర్యాదుదారు ఆరోపించారు అని NHRC తన పేర్కొంది. ఈ వివాదం తర్వాత గుర్​ప్రీత్ కౌర్​ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్‌కు లీగల్ నోటీసు పంపారు. ఆయనే ఈ ఫిర్యాదు చేశారు. ఈ మాజీ న్యాయమూర్తి కాంగ్రెస్ నేత సుఖ్‌పాల్ ఖైరాకు బావమరిది కావడం గమనార్హం.

Bhagwant Mann | ఆరోపణలకు భయపడను

ఆరోపణలు, నిరాధారమైన వాదనలు చేయడం సులభం అని పంజాబ్​ సీఎం భార్య​ అన్నారు. వాటికి తాను భయపడనని స్పష్టం చేశారు. తనపై మాట్లాడేవారు ముందుగా వాస్తవాలను సరిచూసుకోవాలని సూచించారు. లేకపోతే చట్టపరమైన నోటీసులు పంపుతానని హెచ్చరించారు. కాగా పంజాబ్‌లో ఎన్నికలకు కొన్ని నెలల ముందు తలెత్తిన ఈ భారీ వివాదం నేపథ్యంలో శిరోమణి అకాలీ దళ్ కూడా ముఖ్యమంత్రి రాజీనామాను డిమాండ్ చేసింది. బీజేపీ, అకాలీదళ్ కూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై మాన్ వెంటనే స్పష్టత ఇవ్వాలని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా డిమాండ్ చేశారు.

దీనిని కూడా చదవండి : Symbiotec Pharmalab IPO | పబ్లిక్ ఇష్యూకు ఫార్మా ల్యాబ్ కంపెనీ.. గ్రే మార్కెట్‌లో భారీ డిమాండ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *