అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dharmapuri Sanjay | ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) పై నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
మాజీ మేయర్ సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు రాజకీయంగా, విధానపరంగా ఉండాన్నారు. కానీ ఒక ముఖ్యమంత్రి శరీర ఆకృతిని (Body Shaming) కించపరుస్తూ మాట్లాడటం, వ్యక్తిగత దూషణలకు దిగజారడం అరవింద్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. నీతులు చెప్పడం, నికృష్ట రాజకీయాలు చేయడమే మీ సిద్ధాంతమా అన్నారు.
Dharmapuri Sanjay | బీజేపీకి ఓటమి భయం
రాజకీయం చేతకాక, వ్యక్తిగత, శారీరక ఆకృతిపై మాట్లాడటం సంస్కారహీనతను చూపిస్తోందని సంజయ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజారంజక పాలన చూసి, బీజేపీ (BJP)కి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే వాళ్లకు పిచ్చిముదిరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్ (Nizamabad) అభివృద్ధి వదిలేసి, ప్రజలను అడుగడుగునా మోసం చేసిన చరిత్ర బీజేపీ నాయకులది అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోవడం మానుకోకపోతే కాంగ్రెస్ శ్రేణులు తగిన బుద్ధి చెబుతాయని ఆయన హెచ్చరించారు. అరవింద్ ధర్మపురి తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనిని కూడా చదవండి : New York Shooting | న్యూయార్క్‌లో కాల్పులు.. భారతీయుడు మృతి