TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ ముందుంటుంది

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ ఎల్లప్పుడూ ముందుంటుందని ఎంప్లాయీస్ జేఏసీ (Employees JAC) రాష్ట్ర ఛైర్మన్, టీఎన్జీవోస్​ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి హుస్సేని అన్నారు. ఇటీవల నిజామాబాద్ (Nizamabad) జిల్లా టీఎన్జీవోస్ కార్యవర్గ ఎన్నికలు జరగగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గం హైదరాబాద్​లోని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను మర్యాదపూర్వకంగా కలిసింది.

TNGOs Nizamabad | ఉద్యోగులకు అండగా..

మారం జగదీశ్వర్, హుస్సేనీ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యోగుల పక్షాన టీఎన్జీవోస్​ నిలుస్తూ అనుక్షణం వారికి అండగా నిలవాలన్నారు. ప్రభుత్వపరంగా రావాల్సిన అన్ని బెనిఫిట్స్​ వచ్చే విధంగా టీఎన్జీవోస్ కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఎన్జీవో (TNGOs Nizamabad) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, కార్యదర్శి నేతికుంట శేఖర్​లను అభినందించారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర సహా అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారాం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సతీష్, జిల్లా సహా అధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షులు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, శివకుమార్ గౌడ్ వివిధ యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు సూర్యప్రకాష్ జ్ఞానేశ్వర్ రెడ్డి, నగేష్, మహేందర్, విశాల్, సునీల్, స్వామి, వినయ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

 ఇది కూడా చదవండి: RB Choudhary | ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *