అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Manala Mohan Reddy | సీఎం, మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు ఎంపీ అర్వింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Manala Mohan Reddy | ఆధారాల్లేకుండా సీఎం, మంత్రులపై ఆరోపణలా..?
ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం, మంత్రులపై ఎంపీ అర్వింద్ (MP Arvind) ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబని మానాల ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి స్కామ్‌లు లేవని.. అలాంటిది సీఎం, మంత్రులను ఉద్దేశిస్తూ ‘మీకు పుట్టగతులు ఉండవు’ అని ఎంపీ మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
Manala Mohan Reddy | నీట్ పరీక్ష స్కాంపై ఎంపీ ఎందుకు మాట్లాటలేదు..
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ‘నీట్’ పరీక్ష స్కామ్‌పై ఎంపీ ఎందుకు మాట్లాడలేదని మానాల ప్రశ్నించారు. ఈ స్కాంలో బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకుల అనుచరులే ఉన్నారని.. దీనికి ఎంపీ ఏం సమాధానం చెప్తాడన్నారు. ఈ స్కాంకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని ఈ దేశ యువత ఉద్యమాలు చేస్తున్నారన్నారు. అలాంటిని ఈ విషయాన్ని తప్పుదోప పట్టించేందుకు ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు.
Manala Mohan Reddy | రెండేళ్లుగా జిల్లాకు ఎంపీ ఏం చేశాడు..

రాష్ట్రంలో రెండున్నరేళ్లలో సీఎంతో సహా మంత్రులు వివిధ పథకాల అమలులో తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. కానీ ఈ రెండేళ్లలో ఎంపీగా అర్వింద్ జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని మానాల డిమాండ్ చేశారు. వివిధ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకం పూర్తిస్థాయి అమలు వరకు పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర సీఎం రేవంత్‌రెడ్డిదని ఆయన పేర్కొన్నారు.
Manala Mohan Reddy | దేశంలోనే నంబర్‌వన్ తెలంగాణ..
దేశం మొత్తంగా ఎక్కువగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. అలాంటిని ధాన్యం కొనుగోళ్లపై బస్సుయాత్ర పెట్టిన బీజేపీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మధ్యలోనే యాత్ర ఆపేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్ విషయంలో పోరాడాలి తప్ప రాష్ట్రంపై పసలేని ఆరోపణలు చేసి పరువు తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. రూ. 35వేల కోట్లను ధాన్యం కొనుగోళ్ల కింద రైతుల ఖాతాల్లోకి జమచేశామని ఆయన పేర్కొన్నారు. అవినీతిలో పుట్టి పెరిగిన ఎంపీ అర్వింద్‌కు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాట్లాడే హక్కు ఏమాత్రం లేదని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి..: RTA Bus Inspections | ఆర్టీఏ అధికారుల ముమ్మర తనిఖీలు..