అక్షరటుడే వెబ్‌డెస్క్: Software Engineer Suicide | సాఫ్ట్వేర్ రంగంలో పని ఒత్తిడి ఓ యువతి ప్రాణాలను బలిగొంది. ఢిల్లీలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గంజి కీర్తన (25) తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ నగరం, కాశీబుగ్గలో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Software Engineer Suicide | విపరీతమైన పనిభారం..
కాశీబుగ్గకు చెందిన గంజి ఉమాశంకర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో రెండో కుమార్తె కీర్తన ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా ఆఫీసులో విపరీతమైన పనిభారం (Work Pressure) కారణంగా కీర్తన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. కూతురు డిప్రెషన్లోకి వెళ్లడాన్ని గమనించిన తల్లిదండ్రులు, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో మూడు నెలల క్రితమే వరంగల్‌కు పిలిపించుకున్నారు. అప్పటి నుంచి ఆమె హనుమకొండలోని ఒక మానసిక వైద్యుడి వద్ద చికిత్స పొందుతోంది.
Software Engineer Suicide | తల్లిదండ్రులు లేని సమయంలో..
ఈ క్రమంలోనే పరిస్థితి కొంత మెరుగుపడుతుందని భావిస్తున్న తరుణంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, కీర్తన తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఉమాశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రతిభావంతురాలైన యువతి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో కాశీబుగ్గలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మానసిక ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణం
ఢిల్లీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వరంగల్ కాశీబుగ్గకు చెందిన కీర్తన(25) ఆత్మహత్య
పని ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న కీర్తనను 3 నెలల క్రితం ఇంటికి పిలిపించుకున్న తల్లిదండ్రులు
కొంతకాలంగా… pic.twitter.com/RDmgciBwRt
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026
ఇది కూడా చదవండి: Vishal Sponsorship | సీఎం విజయ్‌కు విషాల్ వినూత్న కానుక