Ambala Borewell Rescue | బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ

హరియాణా రాష్ట్రం, అంబాలా పరిధిలోని ధనౌరా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ambala Borewell Rescue | హరియాణా రాష్ట్రం, అంబాలా పరిధిలోని ధనౌరా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల నిర్భయ్ అనే చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. ప్రస్తుతం బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.

Ambala Borewell Rescue | ఏం జరిగిందంటే..

తండ్రితో కలిసి తన తాతకు భోజనం ఇచ్చేందుకు పొలానికి వెళ్లిన నిర్భయ్, అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలోకి జారిపడ్డాడు. ఇది గమనించిన తండ్రి, స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో యంత్రాంగం రంగంలోకి దిగింది.

Ambala Borewell Rescue | రెస్క్యూ ఆపరేషన్..

చిన్నారి సుమారు 220 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. బాలుడికి శ్వాస ఇబ్బందులు కలగకుండా పైపుల ద్వారా నిరంతరం ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. కెమెరాల ద్వారా లోపల బాలుడి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. చిన్నారిని ప్రాణాలతో కాపాడేందుకు భారత సైన్యం (Army) , ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు ఉమ్మడిగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బోరుబావికి సమాంతరంగా జెసీబీలతో భారీ గుంతను తవ్వుతూ బాలుడిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొడుకు కోసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అక్కడే ఉండి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలని గ్రామస్థులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండి రెస్క్యూ పనులను పర్యవేక్షిస్తోంది.

 

ఇది కూడా చదవండి:  Telangana Aerospace Hub | ఏరోస్పేస్​ హబ్​గా తెలంగాణ : ఉత్తమ్​ కుమార్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *