Urea App Protest | యూరియా యాప్ రద్దు చేయాలని రాస్తారోకో..

యూరియా యాప్​ను రద్దు చేయాలని బీఆర్​ఎస్​నాయకులు రాస్తారాకో చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Urea App Protest | యూరియా యాప్​ను రద్దు చేయాలని బీఆర్​ఎస్​నాయకులు రాస్తారాకో చేశారు. మెండోరా మండలం (Mendora Mandal) పోచంపాడ్ ఎక్స్‌రోడ్డు వద్ద రైతులతో కలిసి వారు ఈ కార్యక్రమం నిర్వహించారు.

Urea App Protest | యాప్​తో అనేక ఇబ్బందులు..

బీఆర్​ఎస్​ నాయకులు మాట్లాడుతూ.. యూరియా పంపిణీకి అమలు చేస్తున్న యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సహకార సంఘాల ద్వారా నేరుగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. యాప్ విధానం కారణంగా స్మార్ట్‌ఫోన్ లేని మహిళలు, వృద్ధ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యాప్ ద్వారా కాకుండా పాత విధానంలోనే యూరియాను సొసైటీలకు పంపిస్తే రైతులు నేరుగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే యూరియా యాప్‌ను ఎత్తివేయాలని, లేకపోతే పెద్దఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మిస్బావద్దీన్, ఉప సర్పంచ్ సంపంగి సతీష్, మండల మార్కెట్ కమిటీ నాయకుడు నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ ఎల్కటూరు గంగారెడ్డి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Manala Mohan Reddy | ఎంపీ అర్వింద్​ నోరు అదుపులో పెట్టుకోవాలి..: మానాల మోహన్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *