Land Survey Deputy Director | భూ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు..

భూ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారీగా నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Land Survey Deputy Director | రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. అన్ని శాఖల్లో లంచాల తీసుకునే అధికారులు తిష్ట వేశారు. అటెండర్​ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు లంచాలకు మరిగారు. ఇటీవల అక్రమాస్తుల కేసుల్లో పలువురు పెద్ద పెద్ద అధికారుల ఇంట్లో వందల కోట్ల అవినీతి సొమ్ము బయట పడటం కలకలం రేపుతోంది.

ఏసీబీ అధికారులు మంగళవారం భూ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఏకకాలంలో 11 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ (Hyderabad)లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం ఏసుకున్నారు. ఆదాయ వనరులకు మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ‘భూములు, సర్వే శాఖ’ (మల్టీ జోన్-2) డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరిపై ఈ దాడులు జరిగాయి.

Land Survey Deputy Director | రూ.32 లక్షల నగదు..

ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో ఛత్రీనాకలోని నరహరి (Land Survey Deputy Director )నివాసం, నారాయణగూడలోని ఆయన కార్యాలయం, బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఆస్తులపై దాడులు చేపట్టారు. అధికారులు సుమారు రూ.32 లక్షల నగదుతో పాటు, పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు మరియు భారీ మొత్తంలో ఉన్న బ్యాంక్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు బయట పడటంతో అధికారులే షాక్​ అయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇది కూడా చదవండి..: ACB Raids Narahari | ల్యాండ్, సర్వే డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *