అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Raids Narahari | ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు (ACB Raids) కలకలం రేపాయి. హైదరాబాద్ (Hyderabad)లోని ఆయన నివాసాలతో పాటు బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు కొనసాగుతన్నాయి.
ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో నారాయణగూడతో పాటు 12 చోట్ల ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. నగరంలోని నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
ACB Raids Narahari | అవినీతి ఆరోపణలు

నరహరి తన అధికారిక ఆదాయానికి మించి భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు మంగళవారం ఉదయం సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ముగిసిన తర్వాత అధికారులు అక్రమాస్తుల వివరాలను వెల్లడించనున్నారు.
ఇది కూడా చదవండి..: Casting Artist Harassment | సినీ అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై నటి ఫిర్యాదు