Ramachander Rao Arrest | బీజేపీ చీఫ్​ రామచందర్​రావు అరెస్ట్​

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramachander Rao Arrest | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నల్గొండ పర్యటనకు వెళ్లకుండా ముందు హౌజ్​ అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

నల్గొండ జిల్లా (Nalgonda District)లో సోమవారం కాంగ్రెస్​, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్​ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయనను పరామర్శించడానికి రామచందర్​రావు వెళ్తానని ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయమే ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం హౌజ్​ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రామచందర్​రావును అరెస్ట్ చేశారు.

Ramachander Rao Arrest | జిల్లా అధ్యక్షుడిపై దాడి

రామచందర్​రావు మాట్లాడుతూ.. తన అరెస్టును, నల్గొండ పర్యటనను అడ్డుకోవడాన్ని ఖండించారు. నల్గొండలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై దాడి జరిగిందని, ఆయన ఇంటిని ధ్వంసం చేశారన్నారు. నిరాశతో కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారన్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారని, నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిని ధ్వంసం చేశారన్నారు. ఆ గొడవలో ఆయన తల్లి గాయపడ్డారని ఆవేదనవ వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తే బీజేపీ దీటుగా స్పందిస్తుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: El Nino Effect | ఎల్​నినో ఎఫెక్ట్.. వర్షాలకు బ్రేక్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *