AAP Protest | బీజేపీ ఎంపీ తరుణ్​ చుగ్​ ఇంటి వద్ద ఉద్రిక్తత

పంజాబ్ అమృత్​సర్​లోని బీజేపీ రాజ్యసభ సభ్యుడు తరుణ్​ చుగ్​ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AAP Protest | పంజాబ్ అమృత్​సర్​లోని బీజేపీ రాజ్యసభ సభ్యుడు తరుణ్​ చుగ్​ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమ్​ ఆద్మీ పార్టీ నాయకులు ఆయన ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు.

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన సజ్జన్ కుమార్ ఆగస్టు 20న మరణించిన విషయం తెలిసిందే. ఆయన నివాసానికి వెళ్లి పలువురు బీజేపీ నాయకులు పరామర్శించారు. దీనిని నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు రాజ్యసభ ఎంపీ తరుణ్ చుగ్ (MP Tarun Chugh) నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

AAP Protest | ఆప్​ పిలుపు మేరకు..

అడిషన్​ డీసీపీ మాట్లాడుతూ.. బీజేపీ నాయకుడు తరుణ్ చుగ్ నివాసం వద్ద బలగాలను మోహరించామన్నారు. సజ్జన్ కుమార్ నివాసానికి బీజేపీ నాయకులు వెళ్లడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఇక్కడ గుమిగూడారని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటానికి తగినంత బలగాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆప్​ ఎమ్మెల్యే అజయ్ గుప్తా మాట్లాడుతూ.. సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులుగా తేలిన వ్యక్తుల నివాసాలకు బీజేపీ సభ్యులు వెళ్లడమే ఈ నిరసనకు కారణమన్నారు. బీజేపీ మతం, ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Ramachander Rao Arrest | బీజేపీ చీఫ్​ రామచందర్​రావు అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *