Skyways Air IPO | లాజిస్టిక్ కంపెనీ ఐపీవోలు ఫ్లాప్.. 10 శాతం నష్టాలలో లిస్టయిన స్కైవేస్ ఏయిర్ కంపెనీ

దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం మరో మెయిన్ బోర్డు కంపెనీ స్కైవేస్ ఏయిర్ లిమిటెడ్ షేర్లు లిస్టయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Skyways Air IPO | లాజిస్టిక్ సర్వీసెస్ అందించే స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 582.80 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. బిడ్డింగ్ ప్రక్రియ ఆగస్టు 24న ప్రారంభమై ఆగస్టు 27 వరకు కొనసాగింది. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 2న (మంగళవారం) స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి.

Skyways Air IPO | ఐపీవోకు భారీ డిమాండ్..

స్కైవేస్ ఏయిర్ కంపెనీ ఐపీవో (IPO)కు మంచి డిమాండ్ కనిపించింది. మొత్తం కోటా 71.25 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 139.69 రెట్లు, ఎన్ ఐఐ కోటా 87.24 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 25.40 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

Skyways Air IPO | పూర్ లిస్టింగ్..

సబ్‌స్క్రిప్షన్ భారీగా కావడం, జీఎంపీ బాగుండడంతో ఐపీవో అలాట్ అయినవారికి మంచి లాభాలు వస్తాయని ఆశించారు. అయితే మార్కెట్ పరిస్థితులు బాగా లేకపోవడంతో లిస్టింగ్ లోనే భారీ నష్టాలు వచ్చాయి. కంపెనీ ఒక్కో షేరును రూ. 138 కి విక్రయించగా.. 10.14 శాతం డిస్కౌంట్‌తో రూ. 124 వద్ద లిస్టయ్యాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే ఒక్కో షేరుపై రూ. 14, ఒక లాట్ పై రూ. 1,400 నష్టం వచ్చింది. ఆ తర్వాత షేర్లు కాస్త కోలుకుని ప్రారంభ నష్టాలను తగ్గించాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో 4.20 శాతం నష్టంతో 132.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *