అక్షరటుడే, ఎల్లారెడ్డి: SIR Notices | రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పకడ్బందీగా సాగుతోంది. అయితే చాలామంది ఓటర్ల ఇంటిపేర్లు ఇతర వివరాలు 2002 ఓటరు జాబితాతో మ్యాచ్ కాకపోవడంతో బీఎల్వోలు నోటీసులు అందిస్తున్నారు.
SIR Notices | ఎమ్మెల్యే కాటిపల్లికి..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా అధికారులు జారీ చేస్తున్న నోటీసుల జాబితాలో ప్రముఖుల పేర్లు కూడా చేరాయి. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కామారెడ్డి (Kamareddy)లో ఓటు హక్కు ఉంది. ఆయన ఎన్యుమరేషన్ ఫామ్‌లో కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని, తండ్రి పేరు పెద్ద రాజిరెడ్డి అని పేర్కొన్నారు. గత రికార్డుల్లో కె.వెంకటరమణారెడ్డి అని, తండ్రి పేరు రాజిరెడ్డి అని ఉన్నట్లు గుర్తించి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన ఆధారాలు చూపి సరిచేసుకోవాలని సూచించారు.
SIR Notices | మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్..
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు సొంత గ్రామం భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఓటు హక్కు ఉంది. ఆయన తండ్రి పేరు వెంకయ్య. 2002 ఓటరు జాబితాలో వెంకయ్య అని ఉండగా, ఎన్యుమరేషన్ ఫామ్‌లో వెంకయ అని వచ్చింది. సెప్టెంబర్ 5న ధ్రువ పత్రాలను సమర్పించాలని ఆ నోటీసులో సూచించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు కూడా ఎస్ఐఆర్ (SIR) నోటీసులు జారీ అయ్యాయి. ఆయన పేరు 2002 ఓటర్ల జాబితాలో డి.మహేష్ కుమార్ గౌడ్ అని ఉండగా, ప్రస్తుత జాబితాలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అని పేర్కొన్నారు. ఈ మేరకు బీఎల్వో ఆగస్టు 21న నోటీసు జారీ చేశారు.
ఇది కూడా చదవండి..: Poor Bride Wedding Help | పేదింటి పెళ్లికూతురికి పుస్తె మట్టెలు అందజేత