అక్షరటుడే, కామారెడ్డి: SIR Common Service Centre | జిల్లా కోర్టు (Kamareddy District Court) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. ముక్తిద సూచించారు. మంగళవారం సాయంత్రం జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో (Legal Services) ఏర్పాటు చేసిన తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
SIR Common Service Centre | ఎంతో ఉపయోగం..
జిల్లా జడ్జి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ద్వారా, పత్రికా కథనాల ద్వారా తెలుసుకున్నామన్నారు. కోర్టుకు వచ్చే న్యాయవాదులు, కక్షిదారులు, సాధారణ ప్రజలకు వెంటనే సేవలు అందేలా జిల్లా కోర్టు ప్రాంగణంలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరామన్నారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు, కక్షిదారులు, సాధారణ ప్రజలు ఎస్ఐఆర్ దరఖాస్తులను సులభంగా నమోదు చేసుకుని ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, మొబైల్ కోర్ట్ జడ్జి దీక్ష, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి టి. నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి డా. సూర సుమలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. నారాయణ, ప్రభుత్వ న్యాయవాది శ్యామ్ గోపాల్ రావు, తహశీల్దార్ హిమబిందు, కోర్టు సీఏవో రాంచందర్, సూపరింటెండెంట్ భుజంగరావు, వెంకట్ రెడ్డి, చంద్రసేన్ రెడ్డి, పారా లీగల్ వలంటీర్ విజయ్ కుమార్ తో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం రంగపేటలో బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్