Kakatiya SSC Results | ర్యాంకుల రేసులో కాకతీయ టాప్.. విజయ రహస్యాలు పంచుకున్న విద్యార్థులు!

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్‌ : Kakatiya SSC Results | తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నిజామాబాద్‌ (Nizamabad)లోని కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాల యాజమాన్యం అందించిన అత్యుత్తమ బోధన, నిరంతర ప్రోత్సాహంతో స్టేట్ ర్యాంకులు సాధించి జిల్లా పేరును మారుమోగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ విజయ రహస్యాలను పంచుకున్నారు.

Kakatiya SSC Results | నిరంతర పర్యవేక్షణతో నా గెలుపు – మరియా అరీషా (589/600)

Kakatiya SSC Results

“పదో తరగతి ఫలితాల్లో 589 మార్కులతో స్టేట్ ర్యాంక్ (State Rank) సాధించడం చాలా గర్వంగా ఉంది. ఈ విజయం వెనుక నా కృషితో పాటు మా కాకతీయ యాజమాన్యం నిరంతర పర్యవేక్షణ ఎంతో ఉంది. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, నా సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ నన్ను ప్రోత్సహించారు. వారి తోడ్పాటు వల్లే ఈ స్థాయి మార్కులు సాధించగలిగాను. భవిష్యత్తులో గొప్ప ఇంజినీర్‌గా స్థిరపడాలన్నదే నా లక్ష్యం. స్వతహాగా ఐఐటీయన్​ అయిన మా డైరెక్టర్​ రామోజీరావు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. దీంతో మంచి మార్కులు సాధించగలిగాం ”

Kakatiya SSC Results | ఐఐటీ లెవల్ కోచింగ్ తోనే సాధ్యమైంది – సి.హెచ్. వర్ష (588/600)

Kakatiya SSC Results

“నేను 588 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించడం వెనుక స్కూల్ యాజమాన్యం ప్రోత్సాహం ఉంది. మాకు 6వ తరగతి నుంచే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అకడమిక్ విద్యతో పాటు ఐఐటీ లెవల్ కోచింగ్ అందించారు. డైరెక్టర్ తేజస్విని పర్యవేక్షణలో జరిగిన వీక్లీ టెస్టులు పరీక్షల పట్ల భయం పోగొట్టి, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. నా లక్ష్యం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడం.”

Kakatiya SSC Results | ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ – బి. శ్రీకర్ (585/600)

Kakatiya SSC Results

 

“నేను 585 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించడానికి పాఠశాల యాజమాన్యం ప్రతి విద్యార్థిపై చూపిన ప్రత్యేక శ్రద్ధే ప్రధాన కారణం. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, ముఖ్యంగా ఒలింపియాడ్ స్కూల్ స్థాయిలో మాకు లభించిన అద్భుతమైన ఫౌండేషన్ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా రాణించాలనుకుంటున్నాను.”

Kakatiya SSC Results | స్కూల్ ప్రోత్సాహమే నా విజయానికి బాట – జాహ్నవి (585/600)

Kakatiya SSC Results

“585 మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్ పొందడం చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్లో నిర్వహించే వీక్లీ టెస్టులు, టీచర్ల ప్రోత్సాహం నా విజయానికి బాటలు వేశాయి. యాజమాన్యం కల్పించిన మెరుగైన విద్యా వాతావరణం వల్లే ఒత్తిడి లేకుండా చదవగలిగాను. భవిష్యత్తులో మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యి నా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తాను.”

Kakatiya SSC Results | కాలేజీ స్థాయి శిక్షణతో – కె. అక్షర (583/600)

Kakatiya SSC Results

“నేను 583 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించాను. కాకతీయ ఒలింపియాడ్ స్కూల్‌ (Kakatiya Olympiad School)లో ఉదయం రెగ్యులర్ సిలబస్‌తో పాటు, మధ్యాహ్నం కాలేజీ లెవల్ లెక్చరర్లతో శిక్షణ ఇవ్వడం మాకు ఎంతో ప్లస్ అయ్యింది. దీనివల్ల కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమయ్యాయి. నా లక్ష్యం భవిష్యత్తులో బైపీసీ (BiPC) తీసుకుని, ఒక గొప్ప కార్డియాక్ డాక్టర్ కావడమే.”

ఇది కూడా చదవండి..: KTS SSC Results | పది ఫలితాల్లో సత్తా చాటిన కేటీఎస్​ విద్యార్థులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *