అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Collector | అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని (wet paddy) మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వంపరంగా కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) భరోసా కల్పించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు(Boiled Rice Mills) తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Nizamabad Collector | డిప్యూటీ సీఎంతో వీడియో కాన్ఫరెన్స్లో..
రాష్ట్ర సచివాలయం నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు చేరిందన్నారు. అయితే దిగుబడులు ఆలస్యంగా వచ్చిన చోట ధాన్యం సేకరణ కోసం 120 వరకు కొనుగోలు కేంద్రాలను (paddy procurement) అందుబాటులో ఉంచామని తెలిపారు.
అకాల వర్షం కురిసిన కారణంగా జిల్లాలో బషీరాబాద్, ఉప్లూర్ తదితర ప్రాంతాల్లో సుమారు 40 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం బస్తాలు తడిసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపడం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని వేగవంతంగా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాను కూడా స్వయంగా మిల్లులను సందర్శించి, ధాన్యం తరలింపు, అన్ లోడింగ్ ప్రక్రియను పరిశీలిస్తానన్నారు.
Nizamabad Collector | ఆందోళన వద్దు..
తడిసిన ధాన్యం విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు భరోసా కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: CUET UG 2026 | సీయూఈటీ-యూజీ’ కొత్త పరీక్ష తేదీలు ఖరారు


