అక్షరటుడే, ఇందూరు: Nizamabad Roads | నగరం(Nizamabad) దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్ అధికారులు (Municipal Development) విఫలమవుతున్నారు. చిన్నపాటి వర్షానికే శివారు కాలనీల్లో రోడ్లన్నీ చిత్తడిచిత్తడిగా మారడంతో ఆయా కాలనీలవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
Nizamabad Roads | 8వ డివిజన్లో..
నగరంలోని 8వ డివిజన్లో శనివారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ(Bad Roads ) పూర్తిగా చిత్తడిగా మారాయి. పీఎఫ్ కార్యాలయం వెనక ప్రాతంలోని సీతారాంనగర్ కాలనీ, బంగారు మైసమ్మ రోడ్ నం.1 ప్రాంతాల్లో మట్టిరోడ్లు ఉండగా.. వర్షానికి బురదమయంగా మారాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తయారైందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ రోడ్లపై నుంచి వెళ్తూ పలు వాహనాలు స్కిడ్ అయి వాహనదారులు కిందపడిపోయారని పేర్కొన్నారు. అయితే తాము కార్పొరేటర్‌ను సంప్రదించామని.. బంగారుమైసమ్మ రోడ్‌నం.1కు సీసీ రోడ్డు మంజూరైందని పేర్కొన్నారన్నారు. కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోవడంతోనే సమస్య పరిష్కారం కావట్లేదని వారన్నారు. రోడ్డు పనులు పూర్తి చేసి కాలనీవాసుల సమస్యను తీర్చాలని వారు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: కేటీఆర్ కన్నెపల్లి పర్యటనను జనగామ జిల్లా కోమల్ల టోల్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వాగ్వాదం