Chandrababu Kuppam Tour | ఏజెన్సీని గంజాయి సాగు కేంద్రంగా మార్చారు : ఏపీ సీఎం చంద్రబాబు

వైసీపీ హయాంలో ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి సాగు కేంద్రంగా మార్చారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Kuppam Tour | వైసీపీ హయాంలో ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి సాగు కేంద్రంగా మార్చారని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆరోపించారు. ఆదివారం ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు.

కుప్పానికి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయని బాబు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, కనెక్టివిటీ పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

Chandrababu Kuppam Tour | క్వాంటం సెంటర్​

రాష్ట్రానికి క్వాంటం, సెమీకండక్టర్ పెట్టుబడులు తెస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. డిసెంబర్‌లో క్వాంటం సెంటర్ ప్రారంభం అవుతుందని తెలిపారు. పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు వెల్లడించారు. పరిశ్రమలను తరిమేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఫండింగ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస, బూతులనే గొడ్డలి పార్టీ నమ్ముకుందన్నారు. హంద్రీనీవా ద్వారా కుప్పంకు నీరు తెచ్చామని, త్వరలో గాలేరు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.

దీనిని కూడా చదవండి : Paddy Bonus Guidelines | సన్నాలకు బోనస్​పై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు.. రైతులకు తిప్పలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *