అక్షరటుడే, ఇందూరు: Municipal Drive | వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ నగరంలో (Nizamabad Municipal Corporation) చేపట్టిన స్పెషల్ డ్రైవ్ విజయవంతంగా పూర్తయిందని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
Municipal Drive | 10వ తేదీ నుంచి..
ఈ నెల 10వ తేదీ నుండి స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించించామని, ప్రతి రోజు సగటున రెండు నుండి మూడు డివిజన్లలో విస్తృత స్థాయిలో పారిశుధ్య పనులను చేపట్టి పూర్తి చేశామన్నారు. ఆయా డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే(Urban MLA Dhanpal), మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్చందంగా భాగస్వాములయ్యారని అన్నారు. ఒక్కో సర్కిల్ పరిధిలోని శానిటేషన్ కార్మికులు సుమారు వంద మంది చొప్పున సామూహికంగా పారిశుధ్య పనులను చేపట్టడంతో ఆయా డివిజన్లలో పరిశుభ్రత కార్కక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టగలిగామన్నారు.
డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను తరలించడం, పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను శుభ్రం చేయడం వంటి పనులు అన్ని డివిజన్లలో పూర్తయ్యాయని తెలిపారు. మురుగును, చెత్తను నివాస ప్రాంతాల మధ్య నుండి వెంటదివెంట తరలించినట్లు చెప్పారు. కలెక్టర్ చొరవతో పలు డివిజన్లలో శ్రమదానం కార్యక్రమాలు సైతం జరిగాయని వివరించారు.
Municipal Drive | నీళ్లు నిల్వ ఉండకుండా..
వర్షాకాలంలో నీరు నిలువ ఉండకుండా ఆయా నివాస ప్రాంతాలలోని మురుగు కాలువల్లో పూడికతీత పనులను కూడా వేగవంతంగా జరిపిస్తున్నామని కమిషనర్ తెలిపారు. వర్షాలు కురిసినప్పుడు చెత్తాచెదారం మురుగు కాలువల్లోకి చేరి, పూడిక వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు, ప్రధాన రహదారులు మునిగిపోతున్నాయన్నారు. అందుకోసం ప్రణాళికాబద్దంగా డీసిల్టింగ్ పనులు చేయిస్తున్నామని తెలిపారు. అవకాశం ఉన్న చోట జేసీబీల ద్వారా, మిగితా చోట్ల పారిశుధ్య కార్మికులతో పూడికతీత పనులు జరిపిస్తున్నామని వివరించారు.
ఐదు జోన్ల పరిధిలో దాదాపు 23 కిలోమీటర్ల పొడవుతో కూడిన స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలు ఉండగా, రూ.68.96 లక్షల అంచనా వ్యయంతో డీసిల్టింగ్ పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 17.22 కిలోమీటర్ల పొడవుతో కూడిన డ్రైనేజీల డీసిల్టింగ్ పూర్తయ్యిందని వివరించారు. మిగితా పనులను కూడా వారం పది రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Fans నాకు ‘Concept King’ అనే బిరుదిచ్చారు..