BC JAC Protest | 2న కళాశాలల బంద్​ను విజయవంతం చేయాలి..

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తలపెట్టిన కళాశాలల బంద్​ను సక్సెస్​ చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BC JAC Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ (Fee Reimbursement)​ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తలపెట్టిన కళాశాలల బంద్​ను సక్సెస్​ చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్(Narala Sudhakar) మీడియాతో మాట్లాడారు.

BC JAC Protest | పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇవ్వాలి..

బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ చేపట్టాలని పిలుపునిచ్చారని నరాల సుధాకర్​ పేర్కొన్నారు. బంద్​లో భాగంగా ఇంటర్(Inter), డిగ్రీ(Degree), పీజీ, బీఎడ్, ఫార్మసీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫిజియోథెరపీ తదితర కాలేజీలు బంద్ చేసి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత పద్ధతిలోనే ఫీజుల రీయింబర్స్​మెంట్​ స్కీంను యధావిధిగా అమలు చేయాలని, నాలుగేళ్లుగా పెండింగ్​లో ఉన్న ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. పదివేల ర్యాంకు నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి బీసీజేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల మద్దతుతో బంద్​ పాటిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలు రేపటి బంద్​ సహకరించి తమ కళాశాలలను బంద్​ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రకాంత్, శ్రీలత, బగ్గలి అజయ్, లక్ష్మణ్ గౌడ్, రేఖ, అవుసుల రాము తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మరో ఎలక్ట్రికల్ బస్సులో మంటలు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *