Raghav Chadha Petition | రాఘవ్ చద్దా కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Raghav Chadha Petition | రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ( Raghav Chadha )ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఐదు అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించాలని (Takedown) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Raghav Chadha Petition | ఏమిటీ వివాదం?

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి భారతీయ జనతా పార్టీ (BJP) లోకి మారిన ఎంపీ రాఘవ్ చద్దా, రాజకీయ కారణాల వల్ల తనపై కొన్ని వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కోర్టును ఆశ్రయించారు. “డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారారు” అంటూ తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఏఐ (AI) డీప్‌ఫేక్స్, మార్ఫింగ్ వీడియోలు , పోస్టులు వైరల్ చేస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.

raghav.1

Raghav Chadha Petition | కోర్టు కీలక వ్యాఖ్యలు..

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఘాటుగా స్పందించింది. రాజకీయ విమర్శలు చేయడం వేరు, వ్యక్తిగత దూషణలకు దిగడం వేరని కోర్టు అభిప్రాయపడింది. “సదరు పోస్టులు ఆరోగ్యకరమైన రాజకీయ విమర్శల పరిధిని దాటి, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయి” అని స్పష్టం చేస్తూ, ఆ పోస్టులను తొలగించాలని ఆదేశించింది. అయితే, ఇది ‘పర్సనాలిటీ రైట్స్’ పరిధిలోకి రాదని, కేవలం పరువు నష్టం కిందికే వస్తుందని కోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Vijaya Mehta Death | దిగ్గజ నటి, దర్శకురాలు విజయ మెహతా కన్నుమూత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *