Drug Seizure | రూ.3 వేల కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం

భారత్​కు తీసుకు వస్తున్న రూ.3 వేల కోట్ల విలువైన డ్రగ్స్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Drug Seizure | గుజరాత్ (Gujarat) ఏటీఎస్‌తో కలిసి భారత కోస్ట్ గార్డ్ నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్​ దొరికాయి. అరేబియా సముద్రంలో ఒక ఇరాన్ పడవ నుంచి రూ. 3 వేల కోట్లకు పైగా విలువైన 526 కిలోల మెథాంఫేటమిన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.

లక్షద్వీప్ సమీపంలో సెప్టెంబర్ 25న కోస్ట్​ గార్డ్​ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టారు. ఓ పడవను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. అందులో ఐదుగురు పాకిస్తానీ జాతీయులను ఉన్నారు. లోపల తనిఖీ చేయగా భారీగా డ్రగ్స్​ లభ్యం అయ్యాయి. స్వాధీనం చేసుకున్న సరుకులో నాణ్యమైన మెథాంఫేటమిన్, హెరాయిన్ ఉన్నాయని కోస్ట్ గార్డ్ తెలిపింది.

Drug Seizure | ముంబైకి తరలింపు

విచారణ, న్యాయపరమైన చర్యల కోసం ఆ పడవను, దానిలోని సిబ్బందిని ముంబైకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దేశంలో ఇటీవల డ్రగ్స్​ దందా భారీగా పెరిగింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి భద్రతా సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారీగా డ్రగ్స్​ లభ్యం కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Ration Card Rules 2026 | రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఆ కార్డులు రద్దు..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *