NEET Protest Cases | కేసులు ఎత్తివేయకపోతే మళ్లీ ఉద్యమం.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం

ఆందోళనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీజేపీ ప్రతినిధులు డిమాండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Protest Cases | కాక్రోచ్​ జనతా పార్టీ (CJP) కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం విధించింది. ఆందోళనకారులపై నమోదైన ఎఫ్​ఐఆర్ (FIR)​ను రద్దు చేస్తామని మంగళవారంలోపు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పేర్కొంది. లేదంటే మరోసారి ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది.

నీట్ పేపర్​ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్​మంతర్ వద్ద 36 రోజుల పాటు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ (Dharmendra Pradhan) రాజీనామా చేశారు. నిరసనల్లో భాగంగా ఈ నెల 20న ఆందోళనకారులు పార్లమెంట్​ ముట్టడికి యత్నించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా చేయడంతో విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని, పేపర్​ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని సీజేపీ షరతులు పెట్టింది. వీటికి కేంద్రం ఒప్పుకోవడంతో నిరసనలు విరమించింది.

NEET Protest Cases | విద్యార్థులను అరెస్ట్ చేయడంతో..

నిరసనకారులపై పోలీసు చర్యలు తీసుకోకూడదనే ఒప్పందాన్ని ఉల్లంఘించారన్ని సీజేపీ పేర్కొంది. బీహార్, బెంగాల్‌లలో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని తెలిపింది. ఢిల్లీ, ఇతర రాష్ట్రాలలో వందలాది మందిపై నిఘా పెట్టారని ఆరోపించింది. నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, విద్యార్థులను విడుదల చేయాలని సీజేపీ నేతలు డిమాండ్​ చేశారు. లేకపోతే మళ్లీ ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. కాగా కేసుల ఉపసంహరణకు సంబంధించి తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

దీనిని కూడా చదవండి : Nitin Gadkari Deepfake | నితిన్ గడ్కరీ డీప్‌ఫేక్ వివాదం.. పరువు నష్టం దావాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *